- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్ డీల్‌లో న్యాయం లేదు.. సీజ్‌ఫైర్ డీల్‌ను రిజెక్ట్ చేసే యోచనలో హమాస్!
by Phanindra |
యూఎస్ ప్రతిపాదించిన డీల్‌లో న్యాయం లేదని హమాస్ భావిస్తోందట. అందుకే సీజ్‌ఫైర్ డీల్‌ను రిజెక్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

X
దిశ, నేషనల్ బ్యూరో: యూఎస్ ప్రతిపాదించిన సీజ్‌ఫైర్ ఒప్పందం న్యాయంగా లేదని హమాస్ నేతలు భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో న్యాయం లేదని, దీని వల్ల గాజాలో అమాయకుల చావులు ఆగవని వారు అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని యూఎస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఒప్పందం యుద్ధాన్ని ఆపడంతోపాటు తమ ప్రజలు చేస్తున్న ఏ ఇతర డిమాండ్లను తీర్చడం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నైమ్ అన్నారు. అయితే తాము ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, ఈ ఒప్పందాన్ని అంగీకరించడానికి తాము సుముఖంగా లేమని, దీన్ని రిజెక్ట్ చేయాలని అనుకుంటున్నామని హమాస్ వర్గాలంటున్నాయి.
Next Story






