Hamas: హమాస్ నేతల ఫొటోలతోఊరేగింపు.. కేరళలో వివాదం

by B.Srinivas |

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో నిర్వహించిన ఊరేగింపు వివాదాస్పదంగా మారింది.

Hamas: హమాస్ నేతల ఫొటోలతోఊరేగింపు.. కేరళలో వివాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని పాలక్కాడ్ (Palakkkad) జిల్లాలో నిర్వహించిన ఊరేగింపు వివాదాస్పదంగా మారింది. ఓ సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) నాయకుల చిత్రాలను ప్రదర్శిస్తూ ఊరేగింపు చేశారు. త్రితల ఉత్సవంలో పలువురు యువకుల బృందం ఏనుగులపై హమాస్ టెర్రరిస్టుల ఫొటోలను పట్టుకుని కూర్చున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది. ఈ కార్యక్రమం మతపరమైన పండుగతో ముడిపడి ఉందని కొందరు ఆరోపిస్తుండగా, ఈ తరహా బ్యానర్లను అనుమతించినందుకు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే రాష్ట్ర మంత్రి ఎంబీ రాజేష్ (Rajesh), మాజీ ఎమ్మెల్యే వీటీ బలరామ్ (Vt balaram) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ (Surendran) మాట్లాడుతూ..ఈ కార్యకలాపాలన్నీ సీపీఎం మద్దతుతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ తరహా ఘటనలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించాలని డిమాండ్ చేశారు. కాగా, ఉగ్రవాద సంస్థ హమాస్ కు, ఇజ్రాయెల్‌కు మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

Next Story