- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hamas- Israel: హమాస్ చెర నుంచి ముగ్గురు.. ఇజ్రాయెల్ నుంచి 90 మంది పాలస్తీనియన్ల విడుదల
హమాస్(Hamas) చెర నుంచి ముగ్గురు(Hamas frees 3 hostages) ఇజ్రాయెల్ మహిళలు స్వదేశానికి చేరారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనియన్(Israel releases 90 Palestinians) ఖైదీలను విడుదల చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్(Hamas) చెర నుంచి ముగ్గురు(Hamas frees 3 hostages) ఇజ్రాయెల్ మహిళలు స్వదేశానికి చేరారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనియన్(Israel releases 90 Palestinians) ఖైదీలను విడుదల చేసింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే, ముగ్గురు మహిళా బందీల విడుదల ఆదివారం ఉదయమే జరగాల్సి ఉండగా.. హమాస్ పేర్లు వెల్లడించలేదన్న కరణంగా మూడు గంటలు ఆలస్యమైంది. రోమి గోనెన్ (24), ఎమిలి దమారి (28), డొరోన్ స్టెయిన్‌బ్రెచర్ (31)ను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించడంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పులు ఆదివారం మధ్యాహ్ననానికి ఆగిపోయాయి.
తొలిదశ కాల్పుల విరమణ
ఆరువారాలు సాగే ఈ తొలి దశ కాల్పుల విరమణలో తమ చెరలోని బందీలుగా ఉన్న 98 మందిలో 33 మందిని హమాస్ విడతలవారీగా విడుదల చేస్తుంది. ఇందుకు ప్రతిగా దాదాపు రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను, నిర్బంధంలో ఉన్న గాజావాసులను ఇజ్రాయెల్ వదిలిపెట్టనుంది. తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను గాజా సిటీలోని అల్-సరాయా స్క్వేర్ దగ్గర రెడ్‌క్రాస్‌కు హమాస్ మిలిటెంట్లు అప్పగించారు. ఆ సమయంలో మాస్కులు ధరించిన మిలిటెంట్లు.. భారీసంఖ్యలో అక్కడ గుమికూడిన పాలస్తీనియులను నియంత్రిస్తూ కనిపించారు. బందీలను రెడ్‌క్రాస్ తమకు సురక్షితంగా అప్పగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఈ ముగ్గురు బందీలకు బదులు టెల్ అవీవ్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లోని ఆఫర్ జైలు దగ్గర విడుదల చేసే కార్యక్రమం జరిగింది. ఇకపోతే, 2023, అక్టోబర్ 7నలో ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడి చేయడంతో సుమారు 1,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు విడుదల కాగా.. మరికొందరు చనిపోయారు.. ప్రస్తుతం 51 మంది మాత్రమే బందీలుగా ఉన్నట్లు సమాచారం.






