- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ham radio: దేశంలో ఉగ్రదాడులకు కుట్ర..!
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ల్లోని అమెచ్యూర్ హామ్ రేడియో (Ham radio) సంస్థ అనుమానాస్పద రేడియో స్నిగ్నళ్లను(Suspicious signals) గుర్తించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ల్లోని అమెచ్యూర్ హామ్ రేడియో (Ham radio) సంస్థ అనుమానాస్పద రేడియో స్నిగ్నళ్లను(Suspicious signals) గుర్తించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండు నెలలుగా బంగ్లాదేశ్ యాసతో ఉర్దూ, బెంగాలీ, అరబిక్ కోడ్ భాషల్లో అనుమానాస్పద రేడియో సిగ్నళ్లను తమ ఆపరేటర్లు గుర్తించినట్లు పే హామ్ రేడియో సంస్థ వెల్లడించిందని అధికారులు చెప్పుకొచ్చారు. కాగా.. గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బెంగాల్‌తో సరిహద్దులున్న బంగ్లాదేశ్ పాక్ అధికారులతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమానాస్పద రేడియో సిగ్నల్స్ ని కనుగొనడం ఆందోళనకమని అధికారులు అంటున్నారు. మళ్లీ ఇలాంటి సిగ్నల్స్ వస్తే తమకు తెలియజేయాల్సిందిగా రేడియో ఆపరేటర్లకు సూచించారు.
గతేడాది డిసెంబర్ లో..
ఇకపోతే, గతేడాది డిసెంబర్‌లో హామ్ రేడియో ఆపరేటర్లు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్‌హట్, బొంగావ్, దక్షిణ 24 పరగణాస్‌లోని సుందర్‌బన్స్ ప్రాంతాల నుంచి అనుమానాస్పద సిగ్నల్స్ ని గుర్తించారు. ఉర్దూ, అరబిక్ భాషలో వివిధ కోడ్‌లలో మాట్లాడుకుంటున్నట్లు గుర్తించామని అధికారులకు చెప్పారు. మరికొన్ని సార్లు ఇతర భాషల్లోనూ సిగ్నల్స్ అందుతున్నాయన్నారు. అయితే, మొదట్లో వీటిని పట్టించుకోలేదని.. కానీ జనవరిలో జరిగిన గంగాసాగర్ మేళా సమయంలో వినియోగదారులు కూడా తమకు అనుమానాస్పద సంకేతాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైనట్లు తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కోడ్ భాషను డీకోడ్ చేయడానికి కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ స్టేషన్ (రేడియో)కి సమాచారం పంపినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. స్మగ్లర్లు, తీవ్రవాద గ్రూపులు చర్చల కోసం ఇలాంటి సంకేతాలను వాడుకుంటున్నారని అన్నారు. ఇకపోతే, 2002-03లో కూడా ఇదే విధంగా వచ్చిన అనుమానాస్పద సంకేతాలను ట్రాక్ చేసి.. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతం నుంచి అక్రమ రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న ఆరుగురు తీవ్రవాదులను అధికారులు అదుపులోకి తీసుకున్నాయి. అంతకుముందు 2017లో మతఘర్షణలు జరగడానికి ముందు హామ్ రేడియో అనుమానాస్పద సంకేతాలపై ఫిర్యాదు చేసింది.






