హదీ హంతకులు భారత్ లో దాక్కున్నారు : ఢాకా పోలీసులు

by Muthe.Rajitha |

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్ధి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఢాకా పోలీసులు కీలక విషయాలు ప్రకటించారు.

హదీ హంతకులు భారత్ లో దాక్కున్నారు : ఢాకా పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ విద్యార్ధి నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన ఢాకా పోలీసులు కీలక విషయాలు ప్రకటించారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఇచ్చిన మీడియా సమాచారంలో హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్‌, అలంగీర్‌ షేక్‌ హత్య అనంతరం మేఘాలయ సరిహద్దు గుండా భారత్‌కు పారిపోయినట్లు తెలిపారు. వారు హలువాఘాట్‌ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన వెంటనే ‘పూర్తి’ అనే వ్యక్తిని కలిసారని, అనంతరం సామి అనే టాక్సీ డ్రైవర్‌ వారిని మేఘాలయలోని తురా నగరానికి తీసుకెళ్లాడని వెల్లడించారు. అనుమానితులకు సహాయం చేసిన ఇద్దరు వ్యక్తులను భారత పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని, బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయిన ఇద్దరిని అప్పగించాలనే అంశంపై భారత అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.

Next Story