- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > అలర్ట్: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. అక్కడ పాఠశాలలకు 10 రోజులు సెలవులు!
అలర్ట్: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్.. అక్కడ పాఠశాలలకు 10 రోజులు సెలవులు!
by Satheesh |
హంకాంగ్ ఫ్లూగా పిలుస్తున్న హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హంకాంగ్ ఫ్లూగా పిలుస్తున్న హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్నది. ఇటీవలే ఈ వైరస్‌బారిన పడి కర్ణాటక, హరియాణా, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సెలువులు మంజూరు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి దృష్ట్యా 10 రోజులపాటు విద్యార్థులకు సెలవులు ఇచ్చింది. ఈ సెలవులు మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదేశాల్లో పేర్కొంది. హెచ్3ఎన్2 వైరస్‌కు సంబంధించి పుదుచ్చేరిలో 79 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
Next Story






