కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-18 06:13:23  IST  )

కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) నియమితులయ్యారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్(Gyanesh Kumar) నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ రాజీవ్ కుమార్(Rajeev Kumar) పదవీకాలం ముగియడంతో కొత్త సీఈసీగా కేంద్రంలోని మోడీ సర్కారు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన కమిషనర్‌గా నియమించింది. ఈయన 2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగనున్నారు.


జ్ఞానేష్ కుమార్ 1998 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్(Kerala Cadre IAS) అధికారి. ప్రస్తుతం రాజీవ్ కుమార్ సీఈసీ(CEC)గా ఉన్న కమిటీలోని ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో సీనియర్. ఎన్నికల కమిషనర్‌ పదవి చేపట్టడానికి ముందు కేంద్ర హోం శాఖ‌(Central Home Department)లో జ్ఞానేష్ కుమార్ విధులు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ముసాయిదా బిల్లు రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ముందుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) పదవుల కోసం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సైతం సభ్యులు ఉన్నారు.

Next Story