- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో ఫోన్ మాట్లాడిన భర్త.. కిరాతకంగా హతమార్చిన ప్రియురాలు.. సంచలన ఘటన
గురుగ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యతో ఫోన్ మాట్లాడటాన్ని చూసిన ప్రియురాలు.. శృంగార భాగస్వామిని అతి కిరాతకంగా హతమార్చింది. యశ్మీత్ కౌర్.. స్క్రాప్ డీలర్ హరీశ్ శర్మతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటుంది. ఏడాది కాలంగా ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు. అయితే హరీశ్‌కు

దిశ, వెబ్ డెస్క్ : గురుగ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్యతో ఫోన్ మాట్లాడటాన్ని చూసిన ప్రియురాలు.. శృంగార భాగస్వామిని అతి కిరాతకంగా హతమార్చింది. యశ్మీత్ కౌర్.. స్క్రాప్ డీలర్ హరీశ్ శర్మతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటుంది. ఏడాది కాలంగా ఒకే ఫ్లాట్‌లో కలిసి ఉంటున్నారు. అయితే హరీశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వారి గ్రామంలోనే ఉంటున్నారు. కాగా భార్యకు హెల్త్ సరిగ్గా లేకపోవడంతో ఫోన్ చేసి మాట్లాడాడు. కానీ ఈ విషయం లివ్ ఇన్ పార్టనర్ కౌర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. కోపంలో ఆమె కత్తితో ఛాతీలో పొడిచింది. ఆస్పత్రికి తరలించగా.. అధిక రక్తస్రావం కావడంతో అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. నేరం అంగీకరించిన కౌర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నాడు.






