కపిల్‌శర్మ కేఫ్‌పై మరోసారి దుండగులు కాల్పులు.. దర్యాప్తు చేపడుతోన్న కెనడా పోలీసులు

by Kema Shiva Kumar |

కెనడాలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) నిర్వహిస్తున్న కేఫ్‌పై దుండగులు మరోసారి విచక్షణారహితగా కాల్పులకు తెగబడ్డారు.

కపిల్‌శర్మ కేఫ్‌పై మరోసారి దుండగులు కాల్పులు.. దర్యాప్తు చేపడుతోన్న కెనడా పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడాలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) నిర్వహిస్తున్న కేఫ్‌పై దుండగులు మరోసారి విచక్షణారహితగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ కాల్పులకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్‌కు చెందిన గోల్డీ ధిల్లాన్, కుల్విర్ సిద్ధూలు నెట్టింట్లో పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. సినీ ఇండస్ట్రీలో మతానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అందుకు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆ పోస్టులో వారు వార్నింగ్ ఇచ్చారు. కాగా, కాల్పుల ఘటనపై కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే కపిల్ శర్మ కేఫ్‌పై దుండగులు ఇప్పటి వరకు మూడు సార్లు కాల్పులు జరిపారు.

Next Story