వైట్‌హౌస్ వద్ద ఆగంతకుడి కాల్పులు.. అక్కడికక్కడే ఇద్దరు నేషనల్ గార్డ్స్ దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-27 04:38:18  IST  )

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ (White House) నుంచి కేవలం రెండు బ్లాక్స్ దూరంలో బుధవారం అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో కాల్పుల మోత మోగింది.

వైట్‌హౌస్ వద్ద ఆగంతకుడి కాల్పులు.. అక్కడికక్కడే ఇద్దరు నేషనల్ గార్డ్స్ దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ (White House)‌కు అతి సమీపంలో బుధవారం అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:15 గంటల సమయంలో కాల్పుల మోత మోగింది. వెస్ట్ వర్జీనియా (West Virginia) నేషనల్ గార్డ్‌కు చెందిన ఇద్దరు సైనికులపై అఫ్ఘానిస్తాన్ (Afghanistan) దేశానికి చెందిన అనుమానిత యువకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. వైట్‌హౌస్ సమీపంలోని ఫారగట్ స్క్వేర్ మెట్రో స్టేషన్ వద్ద 17వ రోడ్డు, I స్ట్రీట్ NWకి చేరువలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగింది. అయితే, కాల్పులు జరిపిన అఫ్ఘాన్ యువకుడు మిలిటరీ యూనిఫాం ధరించి రావడంతో గార్డులు అతన్ని గుర్తించలేకపోయారు.

ఈ మేరకు ఘటన జరిగిన వెంటనే మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ, ఎఫ్‌బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీస్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వంటి ఏజెన్సీలు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. కాల్పులు జరిగిన వెంటనే వైట్‌హౌస్‌లో ‘కండిషన్ రెడ్’ అలర్ట్ ప్రకటిస్తూ లాక్‌డౌన్ విధించారు. దీంతో వైట్‌హౌస్, ట్రెజరీ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేయబడ్డాయి. వైట్‌హౌస్ వద్ద కాల్పుల ఘటనపై ఫ్లోరిడాలో ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇప్పుడే చేదు వార్తను విన్నా.. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదని కామెంట్ చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన గార్డ్స్‌ కోసం ప్రార్థనలు చేద్దామని ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story