- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gulabrao: మహిళలు తమ పర్సుల్లో కత్తులు, కారం పొడి తీసుకెళ్లాలి.. మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావ్ పాటిల్
మహిళలు ఆత్మరక్షణ కోసం తమ పర్సుల్లో లిప్ స్టిక్‌లతో పాటు కత్తులు, కారం పొడి తీసుకెళ్లాలని శివసేన నేత గులాబ్‌రావ్ పాటిల్

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలు ఆత్మరక్షణ కోసం తమ పర్సుల్లో లిప్ స్టిక్‌లతో పాటు కత్తులు, కారం పొడి (Chilli powder) తీసుకెళ్లాలని మహారాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత గులాబ్‌రావ్ పాటిల్ (Guab rao patil) సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘మహిళా సాధికారత పై నిరంతరం మాట్లాడుతున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే (Balthakreay) ఓ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు తమ వెంట కారం పొడి, రాంపురి కత్తిని తీసుకెళ్లాలని చెప్పారు. అందుకు ఆయనను జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించారు. కానీ నేటికీ పరిస్థితి కూడా అలాగే ఉంది. యువతులు స్వీయ రక్షణ కోసం అలాంటి వస్తువులనే తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి’ అని వ్యాఖ్యానించారు. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అన్ని రంగాల్లోనూ మహిళలు భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.






