- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > మాజీ సీఎం రూపానీ మృతికి గుజరాత్ ప్రభుత్వ సంతాపం.. రోజంగా సగం ఎత్తులోనే జెండాలు!
మాజీ సీఎం రూపానీ మృతికి గుజరాత్ ప్రభుత్వ సంతాపం.. రోజంగా సగం ఎత్తులోనే జెండాలు!
by Phanindra |
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతికి సంతాపంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: మాజీ సీఎం విజయ రుపానీ మృతికి సంతాపం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో రూపానీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు అధికారిక లాంఛనాలతో రాజ్‌కోట్‌లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగరేసే ప్రతిచోటా సగం ఎత్తులో జెండాను ఎగరేయాలని, రాష్ట్రంలో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టదని అధికారులు ప్రకటించారు. డీఎన్ఏ టెస్టింగ్ ద్వారా రూపానీ మృతదేహాన్ని ఆదివారం నాడు గుర్తించిన అధికారులు.. కుటుంబ సభ్యులకు దాన్ని అప్పగించారు. కాగా, డీఎన్ఏ టెస్టింగ్‌తో సుమారు 86 మంది మృతదేహాలను గుర్తించినట్లు గుజరాత్ హోం మినిస్టర్ హర్ష్ సంఘావీ తెలిపారు.
Next Story






