భార్యను చెంపదెబ్బ కొట్టడం క్రూరత్వం కాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

భ‌ర్త భార్య‌ను చెంప‌దెబ్బ కొట్ట‌డం క్రూర‌త్వం కాద‌ని గుజ‌రాత్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించింది అన‌డానికి బ‌ల‌మైన ఆధారాలు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

భార్యను చెంపదెబ్బ కొట్టడం క్రూరత్వం కాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: భ‌ర్త భార్య‌ను చెంప‌దెబ్బ కొట్ట‌డం క్రూర‌త్వం కాద‌ని గుజ‌రాత్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. భార్య త‌న భ‌ర్త‌కు చెప్పకుండా త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లి రాత్రంతా అక్క‌డే ఉంద‌న్న కార‌ణంతో భ‌ర్త ఆమెను చెంప‌దెబ్బ కొట్టిన ఘ‌ట‌న ఐపీసీ సెక్ష‌న్ 498A ప్రకారం క్రూరత్వం కాద‌ని పేర్కొంది. చెంప‌దెబ్బ‌నే ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించింది అన‌డానికి బ‌ల‌మైన ఆధారాలు కావాల‌ని స్ప‌ష్టం చేసింది.

23ఏళ్ల త‌ర‌వాత క్రూర‌త్వం, ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపించాడు అనే ఆరోప‌ణ‌ల‌పై కోర్టు అత‌డిని నిర్దోశిగా ప్రకటించింది. దిలీప్ భాయ్ అనే వ్యక్తి ప్రేమిలా అనే మహిళను వివాహం చేసుకోగా పెళ్లైన ఏడాదికి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. 1996మేలో భార్య ఆత్మహత్య చేసుకోగా ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్తపై ఐపీసీ సెక్షన్ 498ఏ (క్రూరత్వం) , 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) శిక్ష విధించారు. 2003లో సెష‌న్స్ కోర్టు భ‌ర్త‌కు శిక్ష వేస్తూ తీర్పు ఇవ్వ‌గా ఆయ‌న దానిని స‌వాల్ చేస్తూ హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీంతో భ‌ర్త త‌ర‌పున న్యాయ‌వాదులు త‌మ క్ల‌యింట్ ప‌నికోసం వెళ్లి రాత్రి ఆల‌స్యంగా వ‌చ్చేవాడ‌ని ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో చెప్పకుండా త‌ల్లిదండ్రుల ఇంటికి వెళ్లినందుకు చెంప‌దెబ్బ కొట్టాడ‌ని అయితే అది చ‌ట్టాల ప్ర‌కారం క్రూర‌త్వం కాద‌ని వాదించారు. వ‌ర‌క‌ట్నం డిమాండ్ చేయ‌డం, వేధింపులకు పాల్ప‌డిన‌ట్టు ఎలాంటి ఆధారాలు లేవ‌ని వాదించారు. దీంతో కోర్టు భ‌ర్తను నిర్దోశిగా ప్ర‌క‌టిస్తూ తీర్పునిచ్చింది.

Next Story