Ahmedabad Plane Crash: గుజరాత్ మాజీ సీఎం రూపానీ మృతి.. ధ్రువీకరించిన బీజేపీ!

by Phanindra |   (  Updated:2025-06-12 18:33:36  IST  )

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం రూపానీ మృతి చెందారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి.

Ahmedabad Plane Crash: గుజరాత్ మాజీ సీఎం రూపానీ మృతి.. ధ్రువీకరించిన బీజేపీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ కీలక నేత విజయ్ రూపానీ కూడా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు. లండన్‌లో ఉన్న కూతుర్ని కలిసేందుకు రూపానీ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ విమానానికి ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుంచి రాజ్‌కోట్‌లోని ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2016 నుంచి 2022 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రూపానీ మరణం చాలా బాధాకరమని సీఆర్ పాటిల్ అన్నారు. ఈ ఘటనతో బీజేపీ కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు.

రెండో సీఎం..

ఇలా విమాన ప్రమాదంలో మరణించిన రెండో గుజరాత్ సీఎం రూపానీ కావడం గమనార్హం అంతకుముందు 1965లో గుజరాత్ సీఎంగా ఉన్న కాంగ్రెస్ నేత బల్వంత్‌రాయ్ మెహతా కూడా ఇలాంటి ప్రమాదంలోనే కన్నుమూశారు. భారత్, పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజుల్లో హెలికాప్టర్‌లో మెహతా, ఆయన భార్య, ముగ్గురు స్టాఫ్ మెంబర్లు, ఇద్దరు క్రూ, ఒక జర్నలిస్టు వెళ్తుండగా.. పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఆ విమానాన్ని కూల్చేసింది. ఈ దాడిలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు.

Next Story