- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandola Lake Operation : గుజరాత్ 'చందోలా లేక్ ఆపరేషన్'
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అందులో భాగంగా.. గుజరాత్(Gujarat) లోని అహ్మదాబాద్(Ahmadabad)లో చందోలా లేక్ ఆపరేషన్(Chandola Lake Operation) మొదలుపెట్టింది. ఈ చందోలా లేక్ ప్రాంతం గుజరాత్ లోనే అక్రమ బంగ్లాదేశీ నివాసితులకు అతిపెద్ద కేంద్రంగా పేరుంది. అయితే పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ అక్రమ నివాసితుల ఇళ్లను కూల్చివేసే ఆపరేషన్‌కు సిద్ధమైంది అక్కడి ప్రభుత్వం. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(AMC), గుజరాత్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో, సియాసత్‌నగర్ బంగల్ వాస్‌లోని అనధికార నిర్మాణాలను 80 JCB మిషన్లు, 60 డంపర్‌లతో కూల్చివేశారు. అలాగే 890 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారిలో 143 మంది బంగ్లాదేశీలుగా, 110 మంది ఇతర దేశాల వారు నకిలీ గుర్తింపు పత్రాలతో నివసిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు.
లల్లు బిహారీ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని, అద్దెలు వసూలు చేస్తున్నట్టుగా తేల్చిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కూల్చివేతలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నదని, స్థానిక భారతీయులను కూడా అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు రాగా.. అధికారులు మాత్రం చట్టవిరుద్ధ నిర్మాణాలు, అక్రమ వలసలపైనే దృష్టి సారించామని స్పష్టం చేశారు.






