- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mumbai: మహారాష్ట్రలో 172కి చేరిన జీబీఎస్ కేసులు.. ముంబైలో తొలి మరణం
ముంబైలో(Mumbai) గులియన్ బారే సిండ్రోమ్ తో తొలి మరణం నమోదైంది. వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జీబీఎస్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలో(Mumbai) గులియన్ బారే సిండ్రోమ్ తో తొలి మరణం నమోదైంది. వాడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి జీబీఎస్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆ ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న అతడికి వైరస్ సోకినట్లు జనవరి 23న నిర్ధారణ అయ్యింది. కాగా.. కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. దీనితో మహారాష్ట్రలో జీబీఎస్ వల్ల చనిపోయినవారి సంఖ్య 8కి పెరిగింది. ఇకపోతే, మహారాష్ట్రలో కొత్తగా మరో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో, అక్కడ జీబీఎస్ కేసులు 172కి పెరిగాయి. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. 172 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 40, ఇతర గ్రామాల నుంచి 92, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 28, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వకూ 104 మంది రోగులు ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయ్యారు. ప్రస్తుతం 50 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంకో 20 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జీబీఎస్ లక్షణాలు ఇవే
జీబీఎస్ వైరస్ అనేది ఒక న్యూరోలాజికల్ డిజార్డర్. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి నరాల బలహీనత, తిమ్మిరి, పక్షపాతం వంటి వాటికి దారితీస్తుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు సరికదా కోలుకునేందుకు చాలా సమయం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ వ్యాధి ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యాధికి గురైన రోగులు మంచానపడాల్సి వస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందు శ్వాస సంబంధిత లక్షణాలు కన్పిస్తాయి. బాధితులు మెట్లెక్కడం, నడవడం కష్టమౌతుంది. నరాల బలహీనత, కాళ్లు -చేతులు , ముఖం-శ్వాస కండరాలు పూర్తిగా పటుత్వం కోల్పోవచ్చు. నరాలు దెబ్బతినడంతో మెదడు నుంచి అసాధారణ సంకేతాలు కన్పిస్తాయి. హార్ట్ బీట్ వేగంగా ఉంటుంది. రక్తపోటులో మార్పు కన్పిస్తుంది. జీర్ణక్రియ సమస్య, మూత్రాశయం నియంత్రణ సమస్యగా మారుతుంది.






