- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీఎస్టీ తగ్గింపు తర్వాత.. NCH కి 3,000 ఫిర్యాదులు
దేశంలోని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లో మార్పులు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం (Central Govt) జీఎస్టీ లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఆ కొత్త జీఎస్టీ (New GST) ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో అనేక రంగాల్లో కొనుగోలు భారీగా పెరిగినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పన్ను కోతల తర్వాత NCHకి 3,000 GST సంబంధిత ఫిర్యాదులు అందినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ తగ్గింపు (GST deduction) తర్వాత కొంతమంది తమ షాపులలో.. ధరల మార్పులు చేయకుండా అమ్ముతున్నారని వివిధ ప్రాంతాల నుండి ప్రభుత్వ జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కి 3,000 ఫిర్యాదులు వచ్చాయని వినియోగదారుల నిధి ఖరే సోమవారం తెలిపారు. అలాగే వచ్చిన ఫిర్యాదులను తదుపరి చర్య కోసం మేము CBIC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్)కి పంపుతున్నాము" అని ఖరే చెప్పుకొచ్చారు. తగ్గించిన GST రేట్ల ప్రయోజనాలను వినియోగ దారులు పొందకుండా ఉండటానికి తప్పుదారి పట్టించే డిస్కౌంట్ పద్ధతుల ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్న సందర్భాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు.






