- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఆన్ లైన్ గేమింగ్ ముఠా ఆటకట్టించిన GST అధికారులు
by Naga Rani Yarlagadda |
ఆన్ లైన్ గేమ్స్ తో సంపాదించిన డబ్బుకు జీఎస్టీ ఎగవేయడంతో.. ఆ ముఠా గుట్టును జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ గేమ్స్ తో సంపాదించిన డబ్బుకు జీఎస్టీ ఎగవేయడంతో.. ఆ ముఠా గుట్టును జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో జీఎస్టీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న ముఠా.. రూ.5 వేల కోట్ల విలువైన జీఎస్టీలను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. ఈ ముఠాలో ఇద్దరు నిందితులైన ఏసుప్రభు కుమార్ (Wegofin Digital Solutions Founder), రాజశేఖర్ రెడ్డిలను జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఈ గేమింగ్ సిండికేట్ కు మాస్టర్ మైండ్లుగా ఉన్నట్లు తేలింది. కొన్నేళ్లుగా దేశమంతటా గేమింగ్ నెట్వర్కును విస్తరించి.. భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఇళ్లు, ఆఫీసుల్లో అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






