- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమల్లోకి వచ్చిన GST 2.O సంస్కరణలు.. ‘మిడిల్ క్లాస్’ ఫ్యామిలీస్ ఫుల్ హ్యాపీ
ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం గ్రూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) 2.0 సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులూదుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) 2.0 సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశంలో 2017లో జీఎస్టీ అమలు చేశాక అతిపెద్ద టాక్స్ సంస్కరణ ఇవే కావడం విశేషం. నవరాత్రుల తొలి రోజున అమల్లోకి రానున్న ఈ సంస్కరణలను ప్రధాని నరేంద్ర మోడీ ‘GST బచత్ ఉత్సవ్’గా అభివర్ణించారు. జీఎస్టీ తగ్గింపుతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు, రైతులకు, వ్యాపారులకు, చిన్న తరహా వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త టాక్స్ శ్లాబులు..
జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా గతంలో ఉన్న 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు టాక్స్ స్లాబ్‌లను 5 శాతం, 18 శాతంగా రెండు ప్రధాన శ్లాబలుకు కుదించారు. ఇక లగ్జరీ వస్తువులు, సిన్ గూడ్స్ (తంబాకు, సిగరెట్లు వంటివి) కోసం 40 శాతం అనే ప్రత్యేక శ్లాబ్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మార్పులతో రోజువారీ వినియోగ వస్తువులు, ఆహార పదార్థాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి అనేక రంగాలలో ధరలు తగ్గనున్నాయి. ఉదాహరణకు, 36 రకాల లైఫ్-సేవింగ్ ఔషధాలపై జీఎస్టీని పూర్తి ఎత్తేశారు. అలాగే చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కుదించారు.
ఎంఎస్ఎంఈలు, ఎగుమతి రంగాలు బలోపేతం..
జీఎస్టీ తాజా సంస్కరణల వల్ల సుమారు రూ.2 లక్షల కోట్లు ప్రజల చేతుల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మార్పు దేశీయ వినియోగాన్ని భారీగా పెంచుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ మార్పులు వ్యాపారాలకు సులభతరమైన నిబంధనలు, వేగవంతమైన రిఫండ్‌లు, తక్కువ డాక్యుమెంటేషన్ వంటి ప్రయోజనాలను అందిస్తాయని, తద్వారా ఎంఎస్ఎంఈలు. ఎగుమతి రంగం బలోపేతమవుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. FICCI నివేదిక ప్రకారం, గ్రామీణ ఖర్చులలో 75శాతానికి పైగా ఇప్పుడు జీరో లేదా 5 శాతం GST శ్లాబ్‌లో ఉంటాయి. ఇది వినియోగదారులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.
ధరలు తగ్గిన వస్తువులు ఇవే..
రోజువారీ అవసర వస్తువులు (FMCG): ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లాంటి బటర్, చీజ్, పనీర్, పాస్తా, బిస్కెట్లు, నమ్కీన్, జ్యూస్‌లు, కొబ్బరి నీరు, సోయా మిల్క్ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, కాజు), డేట్స్‌లపై జీఎస్టీ 12 శాతం లేదా 18 శాతం నుంచి 5 శాతానిక తగ్గాయి. మిల్క్, పనీర్, ఖాఖ్రా, చపాతీ, రొట్టి మొదలైన వాటిపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. ఇక షాంపూ, టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్, సబ్బులు, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్ వంటి వాటిపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి.
గృహోపకరణాలు: టేబుల్ వేర్, కిచెన్ వేర్, బైసికిల్స్, బాంబూ ఫర్నిచర్, కాంబ్స్, గొడుగులు, ఉత్తమ ఉపకరణాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానాకి తగ్గింది.
వినియోగ వస్తువులు (Consumer Durables): రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీషనర్లు, డిష్‌వాషర్లు, టీవీలు (32 అంగుళాల కంటే పెద్దవి) వంటి వాటిపై జీఎస్టీ28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఓ రకంగా పెద్ద శుభవార్తే. అదేవిధంగా మానిటర్లు, ప్రొజెక్టర్లపై జీఎస్టీ కూడా 28 శాతం నుండి 18%కి తగ్గింది.
ఆటోమొబైల్స్ (Cars, Two Wheelers): పెట్రోల్ కార్లు (1200 సీసీ వరకు), డీజిల్ కార్లు (1500 సీసీ వరకు), 350 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్స్‌పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. అన్ని ఆటోమొబైల్ పార్ట్స్‌పై కూడా 18 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది. ఇది గతంలో 28 శాతంగా ఉండేది.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs): ఇవి 5 శాతం GST వద్దనే కొనసాగుతాయి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు (FCEVs) కూడా 12 శాతం నుంచి 5% శాతానికి తగ్గాయి.
వ్యవసాయ యంత్రాలు: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వాటి భాగాలపై GST 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ఆటో రంగానికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆరోగ్య సంబంధిత వస్తువులు: (Medicines and Medical Devices): 33 రకాల లైఫ్-సేవింగ్ డ్రగ్స్, క్యాన్సర్ మందులపై జీఎస్టీని ఎత్తేశారు. ఇతర అన్ని మందులు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, గాజ్, బ్యాండేజ్‌లు, డయాగ్నస్టిక్ కిట్స్, సర్జికల్ ఉపకరణాలపై GST 12 శాతం నుంచి నుండి 5 శాతానికి తగ్గింది.
ఇన్సూరెన్స్: వ్యక్తిగత లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై (టర్మ్, ULIP, ఎండోమెంట్, ఫ్యామిలీ ఫ్లోటర్స్) జీఎస్టీని పూర్తిగా మినహాయించారు. ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టెక్స్‌టైల్స్, నిర్మాణ రంగం: మాన్‌మేడ్ ఫైబర్, యార్న్‌పై జీఎస్టీ 5 శాతంకి తగ్గింది. దుస్తులు, ఫుట్‌వేర్‌పై 5 శాత జీఎస్టీ విధించారు. ఇక సిమెంట్, మార్బుల్, లెదర్ గూడ్స్‌పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రోత్సహించేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊపయోగపడే మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, షార్పెనర్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ బుక్స్, నోట్‌బుక్స్‌పై జీస్టీని పూర్తిగా ఎత్తేశారు.






