- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GSLV-F16 విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నేడు చేపట్టిన GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నేడు చేపట్టిన GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F16 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహాన్ని సాయంత్రం 5:40 గంటలకు (IST) ప్రయోగించగా.. 743 కి.మీ. ఎత్తులో సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా చేర్చింది.
ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు భూ ఉపరితలం మీద, అలాగే మంచు కప్పబడిన ఉపరితలాలను, సముద్రాలను చిత్రీకరిస్తుంది. భూమిపై మారుతున్న వాతావరణ పరిస్థితులు, సహజ విపత్తులను పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం సహాయపడుతుంది. GSLV-F16 జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మార్క్ II వేరియంట్‌లో 18వ విమానం కాగా స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ లో 12 వది కావడం విశేషం.






