పాక్‌పై దౌత్య యుద్దానికి ఎంపీల బృందం.. సభ్యుడిగా MIM చీఫ్ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2025-05-17 12:02:41  IST  )

భారతదేశం పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగించేందుకు అఖిలపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది.

పాక్‌పై దౌత్య యుద్దానికి ఎంపీల బృందం.. సభ్యుడిగా MIM చీఫ్ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశం పాకిస్తాన్‌పై దౌత్య యుద్ధాన్ని కొనసాగించేందుకు అఖిలపక్ష ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచేందుకు, భారత్ అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని వివిధ పార్టీల ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను అంతర్జాతీయ వేదికలపై బహిర్గతం చేయనున్నారు. మే 22, 23 తేదీల్లో ఏడు బృందాలు విదేశాలకు బయలుదేరనున్నాయి. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఏడు బృందాల్లో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు చోటు దక్కింది. ఇందులో బైజయంత్ జే పాండా బృందంలో తెలంగాణ నుంచి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కి సభ్యునిగా చోటు దక్కింది.

సీమాంతర ఉగ్రవాదం, ఆపరేషన్ సిందూర్‌పై విదేశాల్లో వివరించడానికి తనకు అవకాశం దక్కడంపై ఒవైసీ స్పందించారు. అసదుద్దీన్ మాట్లాడుతూ, "... ప్రస్తుతానికి, నేను చెందిన గ్రూపుకు నా మంచి స్నేహితుడు బైజయంత్ జే పాండా నాయకత్వం వహిస్తారని నాకు తెలుసు. ఈ గ్రూపులో నిషికాంత్ దుబే, ఫంగ్నోన్ కొన్యాక్, రేఖ శర్మ, సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్ ఉంటారు. మనం వెళ్లబోయే దేశాలు UK, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్." తాజా నిర్ణయం ఏ పార్టీ అనుబంధానికి సంబంధించినది కాదు. బయలుదేరే ముందు మేము మరింత వివరణాత్మక సమావేశాన్ని కలిగి ఉంటాము. ఇది ఒక ముఖ్యమైన పని. ఈ బాధ్యతను చక్కగా నెరవేర్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను." ఉగ్రవాదానికి పాక్‌ మద్దతిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌ నిజస్వరూపాన్ని బయటపెడతాము. కేంద్రం అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తాను" అని ఒవైసీ చెప్పుకొచ్చారు.

Click For Tweet..

Next Story