- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టపర్తిలో యుద్ధ విమానాల టెస్టింగ్ సెంటర్‌కు భూమిపూజ
ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా యుద్ధవిమానాల టెస్టింగ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా యుద్ధవిమానాల టెస్టింగ్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అమెరికా ఎఫ్ 35, రష్యా ఎస్ యూ 57 విమానాలకు పోటీగా ఇక్కడ యుద్ధవిమానాలు తయారు చేయనున్నారు. అంతేకాకుండా మెరుగైన టెక్నాలజీతో ఏఐ ఆధారితంగా పనిచేసే ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు చేయబోతునట్టు తెలుస్తోంది. రూ.15,800 కోట్లతో ఈ ఏఎంసీఏ ప్రాజెక్టును చేపడుతున్నారు. 550 ఎకరాల్లో చేపడుతున్న ఎరో కాంప్లెక్స్ తో 1700 మందికి ఉద్యోగాలు రానున్నాయి.
వందలాది మంది ఇంజనీర్లు, టక్నీషియన్లు ఇక్కడ పనిచేయనున్నారు. ఎరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ, రక్షణశాఖ ఆధ్వర్యంలో దీని నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిఫెన్స్ , డ్రోన్స్ రంగాలకు సంబంధించి మరో 12 ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పుట్టపర్తి ఎయిర్ స్ట్రిప్ రన్ వేను సైతం 10 వేల అడుగులకు విస్తరించబోతున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్స్, వాతావరణ సూచన కేంద్రాలు, భద్రతా సదుపుయాలు లాంటి ఆధునిక సదుపాయాలు కల్పించబోతున్నట్టు సమాచారం.






