మరో గంటలో పెళ్లి.. వధువును హత్య చేసిన వరుడు

by Muthe.Rajitha |   (  Updated:2025-11-16 11:35:25  IST  )

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

మరో గంటలో పెళ్లి.. వధువును హత్య చేసిన వరుడు
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహానికి గంట ముందు పెళ్లి చీర, డబ్బు విషయంలో వాగ్వాదం జరిగినందుకు ఆగ్రహానికి గురైన వరుడు వధువును హత్య చేసాడు. భావ్ నగర్ కు చెందిన సాజన్ బరయ్య, తనకు కాబోయే భార్య సోని రాథోడ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, తలను గోడకు బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు శనివారం రాత్రి వివాహం జరగాల్సి ఉండగా ఈ హత్య జరిగింది. దీంతో భయపడిన సాజన్ పరారయ్యాడు. పోలీసులు సమాచారం అందుకుని స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story