విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ నిజమే : పార్లమెంటులో ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం

by Muthe.Rajitha |

ఇటీవల దేశంలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో జరిగిన జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనని నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో ఒప్పుకుంది.

విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్ నిజమే : పార్లమెంటులో ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల దేశంలోని వివిధ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో జరిగిన జీపీఎస్ స్పూఫింగ్ నిజమేనని నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో ఒప్పుకుంది. ముఖ్యంగా ఢిల్లీ సహా పలు విమానాశ్రయాల్లో జీపీఎస్ స్పూఫింగ్, జీఎన్ఎస్ఎస్ జోక్యం నిజమేనని వెల్లడించింది. వీటి వలన ఇటీవలి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(IGI)లో నవంబర్ మొదటి వారంలో 800కి పైగా విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్ని ఇతర రాష్ట్రాలకు మళ్ళించారు.

తప్పుడు సాంకేతిక సిగ్నల్స్ వల్ల విమానాల నావిగేషన్ సిస్టమ్స్‌లో ల్యాండ్ అవ్వాల్సిన టేకాఫ్ అయ్యే ప్రదేశాల స్థానాలు మారిపోయాయి. నవంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2025 వరకు ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో.. ముఖ్యంగా అమృతసర్, జమ్ములో ఇలాంటి 465 ఇన్సిడెంట్లు నమోదయ్యాయి. ఇక ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల సమీపంలో కూడా ఈ సమస్యలు పెరిగాయి.

జీపీఎస్ స్పూఫింగ్ అంటే..

జీపీఎస్ స్పూఫింగ్ అంటే తప్పుడు సాటిలైట్ సిగ్నల్స్ పంపి విమానాల GPS రిసీవర్లలో సమాచారాన్ని తారుమారు చేయడం. ఇది సిగ్నల్ బ్లాక్ చేయడం కంటే ప్రమాదకరం. ఇలాంటి తప్పుడు డేటా వల్ల విమానాలు ఇతర మార్గాల్లోకి వెళ్లి విమాన ప్రమాదాలు లేదా వేరే దేశాల భూభాగాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే జీపీఎస్ స్పూఫింగ్ అనేది సరిహద్దు ప్రాంతాలు, యుద్ధ ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఢిల్లీలో జరగడం సైబర్ దాడిగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై DGCA, AAIలు దర్యాప్తు చేస్తున్నాయి. అదే సమయంలో ILS అప్‌గ్రేడ్‌ చేసి, మల్టీ-లేయర్ నావిగేషన్ సిస్టమ్స్‌తో స్పూఫింగ్‌ను ఎదుర్కొనే చర్యలు తీసుకుంటున్నారు.

Next Story