పేద ప్రజలకు గుడ్ న్యూస్..రేషన్ బియ్యం నాణ్యత పెంపు

by velandi.Saikiran |

రేషన్ బియ్యం నాణ్యత పెంచుతూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది.

పేద ప్రజలకు గుడ్ న్యూస్..రేషన్ బియ్యం నాణ్యత పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు బిగ్ అలర్ట్. దేశంలోని రేషన్ బియ్యం నాణ్యతలను పెంచాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో నూక‌ల శాతాన్ని 25% నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉప్పుడు బియ్యంలో 16% నుంచి ఐదు శాతానికి తగ్గించారు. దీని వల్ల 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు మరింత నాణ్యమైన బియ్యం అందనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక ప్రకటన చేశారు. ఆహార భద్రత వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పేద ప్రజలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో తమ సర్కార్ ముందుకు సాగుతుందన్నారు. అందుకే నాణ్యమైన బియ్యం అందించేందుకు సిద్ధమయ్యామని వివరించారు.

Next Story