ఇరాన్ ఫండ్స్ విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్?

by velandi.Saikiran |

ఇరాన్ ఫండ్స్ విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇరాన్ ఫండ్స్ విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్?
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం దాదాపుగా ముగిసినట్లేనని తెలుస్తోంది. తాజాగా దోహాలో ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సానుకూలంగా ముగిసినట్లు ఇరాన్ ప్రకటించింది. అలాగే ఫ్రీజ్ చేసిన ఆస్తుల్లో కొంత మేర రిలీజ్ చేసేందుకు అమెరికా అంగీకరించిందని వెల్లడించింది. ఈ క్ర‌మంలో ఖతర్ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయిన ఆస్తుల నుంచి దాదాపు రూ.50 వేల కోట్ల నిధులను రిలీజ్ చేసేందుకు అంగీకరించిందట అమెరికా. ఈ నిధులతో ఇరాన్ తనకు అవసరమైన నిత్యవసరాలను కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు ఓ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది. అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటి వరకు అంతా సవ్యంగా సాగిందని చర్చలపై సంతృప్తి కూడా వ్యక్తం చేశారు.

Next Story