- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aviation: ఐదేళ్లలో 50 విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్న కేంద్రం
వచ్చే ఐదేళ్లలో కొత్త విమానాశ్రయాలతో సహా 50 విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో విమానయాన రంగాన్ని మరింత వేగవంతంగా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఐదేళ్లలో కొత్త విమానాశ్రయాలతో సహా 50 విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 159 విమానాశ్రయాలు ఉన్నాయి. 2014లో ఉన్న 74తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయింది. విమానయాన సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణా సంస్థలను పెంచడం వంటి చర్యల ద్వారా ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని, ఇవన్నీ సమగ్రమైన పద్దతిలో జరిగేందుకు చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పౌర విమానయాన కార్యదర్శి వుమ్‌లున్‌మాంగ్ వుల్నామ్ బుధవారం ఢిల్లీలో జరిగిన ఏసీఐ ఆసియా పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ రీజినల్ అసెంబ్లీ కార్యక్రమంలో తెలిపారు. విమానాశ్రయాల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ)పై ప్రభుత్వం దృష్టి సారించింది. విమానాశ్రయ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసేందుకు పటిష్టమైన యంత్రాంగం కూడా ఉందని ఆయన చెప్పారు. విమానాశ్రయాలకు భూమిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) విమానాశ్రయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో ఒకటిగా ఉంది.






