Amit Shah: స్పీకర్లు తమ పదవి, గౌరవాన్ని పెంచేలా కృషి చేయాలి: అమిత్ షా

by Prasad Jukanti |

అసెంబ్లీ స్పీకర్లు తమ పదవి, గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

Amit Shah: స్పీకర్లు తమ పదవి, గౌరవాన్ని పెంచేలా  కృషి చేయాలి: అమిత్ షా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ స్పీకర్లు తమ పదవి, గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తే నిష్పాక్ష వేదికలుగా అసెంబ్లీలు ఉండాలన్నారు. సభలో అధికార, ప్రతిపక్షాలు రెండూ నిష్పాక్షికమైన వాదన చేయాలని, సభ నియమాల ప్రకారం సభ పనితీరు జరిగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు.ఇవాళ ఢిల్లీలో అఖిల భారత స్పీకర్ల సమావేశాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఇవాళ రేపు జరగనున్న ఈ సదస్సుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ స్పీకర్ మీరా కుమారీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా.. దేశ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు, అసెంబ్లీలు కేంద్ర బిందువులనిఈ రెండూ సరిగ్గా పనిచేయకపోతే ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తుతాయని అన్నారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు సజావుగా పనిచేయడం చాలా ముఖ్యం అన్నారు.

Next Story