Rapido, Uber, Ola: ఓలా, ఉబెర్, రాపిడో కస్టమర్లకు బిగ్ షాక్.. పీక్ అవర్స్ లో చార్జీలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్

by Prasad Jukanti |

ఓలా, ఉబెర్, రాపిడో కస్టమర్లకు బిగ్ షాక్

Rapido, Uber, Ola: ఓలా, ఉబెర్, రాపిడో కస్టమర్లకు బిగ్ షాక్.. పీక్ అవర్స్ లో చార్జీలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. యాప్ ఆధారంగా ట్యాక్సీ సర్వీసులు అందిస్తున్న ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం (central government) తీపి కబురు చెప్పింది. పీక్ అవర్స్ లో (peak hours)రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రద్దీ నామమాత్రంగా ఉన్న సమయంలో బేస్ చార్జీల్లో సగం సర్ చార్జీ కింద పెంచుకునేందుకు, ఒక వేళ రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ (aggregators) గైడ్ లైన్స్ ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి మాత్రం ఎలాంటి అదనపు చార్జీలు విధించకూడదని కండిషన్ పెట్టింది. ఒక వేళ ఎలాంటి కారణం లేకుండా డ్రైవర్ రైడ్ ను రద్దు చేస్తే 10 శాతం ఫైన్ (రూ.100 మించకుండా) విధించనుంది. ఈ పెనాల్టీ డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్ ఫామ్ చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన కారణం చెప్పకుండా రైడ్ ను క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు కూడా ఇవే ఫెనాల్టీ వర్తిస్తాయని స్పష్టం చేసింది. మూడు నెలల్లో అన్ని రాష్ట్రాలు ఈ గైడ్ లైన్స్ ను అమలు చేయాల్సిందిగా రవాణా శాఖ సూచించింది.

ప్రైవేట్‌ బైక్ లకు అనుమతి:

అలాగే ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్ సంస్థల కింద సేవలు అందించే వాహనాలకు వెహికిల్ లొకేషన్, ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేసింది. ఈ డేటా ఫీడ్‌.. ఆ సంస్థలతో పాటు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్లకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. దాంతో అత్యవసర పరిస్థితుల్లో సత్వర స్పందనకు వీలు కలుగుతుందని పేర్కొంది. అలాగే ప్రైవేట్ బైకులను కూడా ఓలా ఉబర్, ర్యాపిడోలో వాడుకోవచ్చని కేంద్రం తెలిపింది. చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో బైక్ ట్యాక్సీలను నిలిపివేయాలంటూ ఇటీవల కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్ వర్కర్ల జీవితాలు రోడ్డున పడతాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేథ్యంలో ప్రైవేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధం తొలగిపోనుండగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కష్టమర్లకు షాకించ్చేందుకు ట్యాక్సీ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు స్వాగతిస్తున్నారు.

Next Story