- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధరామయ్య రాజీనామాకు ఆమోదం తెలిపిన గవర్నర్
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. జూన్ మొదటి వారంలో డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడి సీఎం సిద్దరామయ్య రాజీనామా (CM Siddaramaiah resigns) చేసిన విషయం తెలిసిందే. పవర్ షేరింగ్ అగ్రిమెంట్ లో భాగంగా అధిష్ఠానం నిర్ణయంతో ఆయన గురువారం తన రాజీనామా పత్రాన్ని ఆయన నేరుగా లోక్ భవన్‌కు చేరుకుని, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకరు సమర్పించారు. నిన్న గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తన ప్రోటో కాల్స్ ను ముగించుకుని నేరుగా కర్ణాటకకు చేరుకున్నారు. వచ్చిన వెంటనే సీఎం సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ (Governor) ఆమోదం తెలిపారు. దీంతో డీకే శివకుమార్ (DK Sivakumar) సీఎం పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోని సీనియర్ నేతలతో కలిసి కొత్త కేబినెట్ (new cabinet) ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 1న లేదా, 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.






