UPI Charges: యూపీఐ, రూపే వాడే వారికి బిగ్ షాక్! త్వరలో లావాదేవీలపై చార్జీల అమలు యోచనలో కేంద్రం

by Prasad Jukanti |   (  Updated:2025-03-11 06:05:16  IST  )

యూపీఐ , రూపే చెల్లింపులపై చార్జీలు అమలుచేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

UPI Charges: యూపీఐ, రూపే వాడే వారికి బిగ్ షాక్! త్వరలో లావాదేవీలపై చార్జీల అమలు యోచనలో కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్సే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ యూపీఐ (UPI) (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) మేమెంట్లపైనే ఆధారపడుతున్నారు. చెల్లింపులను సులభతరంగా మారడంతో ప్రస్తుంత దేశవ్యాప్తంగా పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు కోట్లాది మంది నిత్యం యూపీఐని ఉపయోగిస్తున్నారు. యూపీఐ ఆధారితంగా పని చేస్తున్న ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ ల వినియోగం పెరిగిపోయింది. అయితే త్వరలో యూపీఐ, రూపే లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను (Merchant Fee) తీసుకురావాలని కేంద్రం (Central Govt) యోచిస్తున్నట్లు సమాచారం. మీ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య ప్రతిపాదనలు పంపించగా అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.

సామాన్యుల రోజువారీ ట్రాన్సాక్షన్లపై ప్రభావం పడుతుందా?

పెద్ద వ్యాపారుల కోసం యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ ను తిరిగి ప్రవేశపెట్టాలని బ్యాంకింగ్ సమాఖ్య ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది. ప్రతిపాదన ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారులకు వారి టీఎస్టీ ఫైలింగ్‌ల ఆధారంగా ఎండీఆర్ ను పునరుద్ధరించవచ్చుని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో కస్టమర్ల చేసే సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రభావం పడబోదని తెలుస్తోంది.

Next Story