మత విషయాల్లో జోక్యం ఉండదు.. దలైలామా వారసత్వంపై భారత్!

by Phanindra |

మత విషయాల్లో తాము అనవసరంగా జోక్యం చేసుకోబోమని భారత ప్రభుత్వ తెలిపింది. దలైలామా వారసత్వ ప్రక్రియపై ఈ వ్యాఖ్యలు చేసింది.

మత విషయాల్లో జోక్యం ఉండదు.. దలైలామా వారసత్వంపై భారత్!
X

దిశ, నేషనల్ బ్యూరో: దలైలామా వారసత్వం విషయంలో వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మతానికి సంబంధించిన అంశాలపై భారత్ ఎలాంటి పొజిషన్ తీసుకోదని విదేశాంగ శాఖ (ఎంఈఏ) తెలిపింది. ‘దలైలామా వ్యవస్థను కొనసాగించడంపై హిజ్ హోలినెస్ దలైలామా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన రిపోర్టులు మా దృష్టికి వచ్చాయి. అయితే ఇలాంటి విషయాల్లో భారత ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకోదు’ అని ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు.

ఇలాంటి మతపర అంశాలపై భారత ప్రభుత్వం అనవసరంగా కామెంట్స్ చెయ్యదని ఆయన స్పష్టంచేశారు. దేశంలోని అందరికీ ఇష్టమొచ్చిన మతాన్ని అనుసరించే హక్కుందని, ఇకపై కూడా అదే విధానం కొనసాగుతుందని చెప్పారు. అయితే టిబెట్‌కు సంబంధించిన అంశాలు భారత్-చైనా ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపుతాయని, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్‌కు తాజాగా చైనా హెచ్చరించింది.

Next Story