- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మలా సీతారామన్ పేరిట పెట్టుబడి వీడియోలు.. క్లారిటీ ఇచ్చిన PIB
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీతారామన్ వీడియోలు ఏఐ జనరేటెడ్ వీడియోలని స్పష్టం చేసింది. కేంద్రం, ఆర్థికశాఖ మంత్రి ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం లేదని తెలిపింది. ఇలాంటి వీడియోలకు స్పందించిందే ముందు.. ప్రభుత్వ అధికార పోర్టల్స్, ఆర్బీఐ, SEBI వంటి సంస్థల ద్వారా నిజానిజాలను ధృవీకరించుకోవాలని సూచించింది. ఇలాంటి ప్రకటనల్లో ఇచ్చే లింక్స్ ను ఓపెన్ చేసేముందు ఒకటికి నాలుగుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని పేర్కొంది. ఓటీపీ, బ్యాంకింగ్ కు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ను గుడ్డిగా ఎవరికీ షేర్ చేయవద్దని, ఇలాంటి ప్రకటనల వల్ల మోసపోయే ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చరించింది.






