- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi : ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై కొరడా ఝుళిపించిన సర్కార్
by Muthe.Rajitha |
ప్రతి ఏటా ఫీజులు పెంచుతూ పోతున్న ప్రైవేట్ స్కూళ్లపై ఢిల్లీ సర్కార్(Delhi Govt) కొరడా ఝుళిపించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఏటా ఫీజులు పెంచుతూ పోతున్న ప్రైవేట్ స్కూళ్లపై ఢిల్లీ సర్కార్(Delhi Govt) కొరడా ఝుళిపించింది. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఢిల్లీ కేబినెట్ ఈ ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సీఎం రేఖా గుప్తా(CM Rekha Gupta) అధ్యక్షతన నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశీశ్ సూద్ తెలిపారు. ఢిల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ బిల్ 2025 పేరుతో తీసుకు వచ్చిన ఈ చర్యలు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
ప్రైవేటు స్కూళ్లల్లో తమ పిల్లలను చదివించే దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ ఆర్డినెన్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని వెల్లడించారు.
Next Story






