- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాపై ఆరోపణలు కొత్తేమి కాదు.. అమెరికా కేసులపై స్పందించిన అదానీ
అమెరికా కేసులపై భారత బిలియనీర్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: భారత బిలియనీర్, పారిశ్రామిక వేత్త గౌతం అదానీ(Gautam Adani)పై ఇటీవల అమెరికా(America)లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అదానీ స్పందించారు. అదానీ గ్రూపుపై కేసులు కొత్తేమి కాదన్నారు. రాజస్థాన్ జైపూర్(Rajasthan Jaipur)లో నిర్వహించిన 57వ జెమ్ అండ్ జువెలరీ అవార్డ్స్ ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదానీ మాట్లాడుతూ తమపై జరిగిన ప్రతి దాడి మరింత బలపడేలా చేస్తుందని తెలిపారు. నిబంధనల ప్రకారమే వ్యాపారాలు చేశామని స్పష్టం చేశారు. కేసులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా స్ప్రెడ్ అవుతోందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదానీ సంస్థలను విచ్చిన్నం చేయలేవని తెలిపారు. తమకు ఎదురైన ప్రతి అవరోధాన్ని అభివృద్ధికి సోపానంగా మార్చుకుంటామని తెలిపారు. అటాక్ జరిగిన ప్రతిసారి తాము బటపడ్డామని చెప్పారు. తమపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవడమే అసలైన సవాల్ అని అదానీ పేర్కొన్నారు.






