- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Google: భారత్‌లో 29 లక్షల యాడ్స్ అకౌంట్లను సస్పెండ్ చేసిన గూగుల్
అంతర్జాతీయంగా కూడా 3.92 కోట్లకు పైగా యాడ్స్ అకౌంట్లను సస్పెండ్ చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన విడుదల చేసింది. భారీ సంఖ్యలో యాడ్స్ అకౌంట్లను సస్పెండ్ చేసినట్టు బుధవారం వెల్లడించింది. కంపెనీ ప్రకటనల విధానాలను దుర్వినియోగం చేసినందుకు భారత్‌లో 29 లక్షల యాడ్స్ అకౌంట్లను సస్పెండ్ చేశామని, అందులో 24.74 కోట్ల ప్రకటనలను తొలగించినట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా కూడా 3.92 కోట్లకు పైగా యాడ్స్ అకౌంట్లను సస్పెండ్ చేసింది. 510 కోట్ల యాడ్స్‌ను తొలగించినట్టు కంపెనీ తన వార్షిక యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్‌లో పేర్కొంది. గూగుల్ ప్రకటనల నిబంధనల ఉల్లంఘనల జాబితాలో ఆర్థిక సేవలకు సంబంధించి యాడ్స్ అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత ట్రేడ్ మార్క్ ఉల్లంఘనలు, యాడ్స్ దుర్వినియోగం, జూదం, గేమ్స్‌కి సంబంధించిన యాడ్స్ ఉన్నాయి. దేశీయంగా డిజిటల్ లావాదేవీలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, బ్రాండ్ల పేర్లను దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిని కస్టమర్లను రక్షించేందుకు గూగుల్ చర్యలు తీసుకుంటోంది. ఇది మంచి పరిణామం. నిరంతరం పెరిగే మోసాలను నిలువరించేందుకు అవసరమైన సామర్థ్యాలను పెంచుతున్నట్టు గూగుల్ పేర్కొంది. కంపెనీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న స్కామ్‌లను అడ్డుకట్ట వేసేందుకు వందల మంది నైపుణ్యం కలిగిన వారిని నియమిస్తున్నట్టు కంపెనీ వివరించింది. ముఖ్యంగా ఏఐ ఆధారిత వీడియో మోసాలను వీరు కట్టడి చేస్తారని గూగుల్ తెలిపింది. దీనివల్ల 7 లక్షలకు పైగా నకిలీ యాడ్స్ అకౌంట్లను శాశ్వతంగా ఆపేశామని వెల్లడించింది.






