Google Maps: గూగుల్ మ్యాప్‌ తెచ్చిన తంటా..! రాత్రంతా కొండల్లో కంటైనర్ డ్రైవర్ జాగరం

by Ramesh Naini |

గూగుల్ మ్యాప్స్​ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఏదైనా అడ్రస్ తెలియకపోతే గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది.

Google Maps: గూగుల్ మ్యాప్‌ తెచ్చిన తంటా..! రాత్రంతా కొండల్లో కంటైనర్ డ్రైవర్ జాగరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గూగుల్ మ్యాప్స్​ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఏదైనా అడ్రస్ తెలియకపోతే గుగుల్ మ్యాప్‌ను అడిగితే దారిని చూపిస్తుంది. అయితే అయితే కొన్నిసార్లు ఈ గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే చిక్కుల్లో పడేస్తూ ఉంటాయి. తాజాగా గూగుల్ మ్యాప్‌ను నమ్ముకున్న ఓ డ్రైవర్‌కు చుక్కలు చూపించింది. కర్ణాటకలోని చిక్ మంగళూరు నుంచి అనంతపురం జిల్లా యాడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడుతో వెళ్తున్న కంటైనర్ డ్రైవర్.. అడ్రస్ తెలియక ఫోన్ లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే మ్యాప్ సూచించిన ప్రకారం పోతు ఓ భారీ గుంతలో ఇరుక్కునేలా చేసింది. సెల్ సిగ్నల్స్ సైతం అందకపోవడంతో డ్రైవర్‌కు రాత్రంతా కొండల మధ్య భయంతో జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉదయం కాగానే డ్రైవర్ స్థానికుల సాయంతో జేసీబీతో కంటైనర్‌ను బయటకు తీసీ అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడం వల్ల ఎంతో మంది చిక్కుల్లో పడ్డారు. కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. గతంలో కర్ణాటక అడవుల్లో బీహార్ కు చెందిన ఓ కుటుంబం చిక్కుకుపోయింది. గత నవంబర్ నెలలో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకోని పాక్షికంగా నిర్మించిన వంతెన నుంచి రామగంగా నదిలోకి కారు పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.

Next Story