- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ప్లాట్ ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో..
by Malleboina Mahesh |
రైల్వే శాఖ ఇటీవల కాలంలో ప్రమాదాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వివిధ కారణాలతో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: రైల్వే శాఖ ఇటీవల కాలంలో ప్రమాదాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వివిధ కారణాలతో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. ఇలాంటి సంఘటనే తాజాగా పశ్భిమ బెంగాల్ రాష్ట్రంలోని డెబ్రా సమీపంలో ఉన్న బలిచక్ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పి.. 5వ నెంబర్ ప్లాట్ ఫామ్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనతో స్టేషన్ పరిసరాల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే, ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌పైకి ఢీకొడుతూ వెళ్లడంతో.. ప్లాట్ ఫామ్ దెబ్బతింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది. సహాయక చర్యలు కొనసాగుతున్నారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ప్లాట్ ఫామ్ పునరుద్దరన చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై రైల్వే శాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.
Next Story






