- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హార్ముజ్ జలసంధి వివాదం.. మరికొద్ది గంటల్లో గుడ్ న్యూస్ అంటూ మార్కో ప్రకటన
పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం హార్ముజ్ జలసంధిపై తీవ్రంగా ఉంది. దానిని తిరిగి తెరిచేందుకు ఒక ఒప్పందం ఖరారయ్యేలా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిగంటల్లోనే.. మార్కో కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం హార్ముజ్ జలసంధిపై తీవ్రంగా ఉంది. దానిని తిరిగి తెరిచేందుకు ఒక ఒప్పందం ఖరారయ్యేలా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిగంటల్లోనే.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిగంటల్లోనే హార్ముజ్ జలసంధి వివాదంపై శుభవార్త వచ్చే ఛాన్సుందని ప్రకటించారు. ఇరాన్ సంక్షోభానికి సంబంధించి.. ఈరోజే మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చని న్యూఢిల్లీలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించేందుకు ఒక ముసాయిదాపై గత 48 గంటల్లో కొంత పురోగతి లభించిందని రూబియో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు వాషింగ్టన్, టెహ్రాన్ దేశాల మధ్య ఒక ఒప్పందం ఖరారయ్యే దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే మార్కో రూబియో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం ప్రారంభించినప్పటి నుండి అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తిందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం కుదురుతున్న ఒప్పందం ద్వారా ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటుందని, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, వాటిని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ట్రంప్ వెల్లడించారు.
మరోవైపు, అమెరికాతో జరుగుతున్న ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న హైలీ ఎన్‌రిచ్డ్ యూరేనియం నిల్వలను వదులుకోవడానికి అంగీకరించిందని 'ది న్యూయార్క్ టైమ్స్' ఒక కథనంలో పేర్కొంది. ఆయుధాల తయారీకి వీలయ్యే స్థాయిలో ఉన్న ఈ యూరేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఇద్దరు అమెరికా ఉన్నతాధికారుల సమాచారాన్ని ఉటంకిస్తూ ఆ పత్రిక రాసింది. అమెరికా పదేపదే డిమాండ్ చేస్తున్న ఈ యూరేనియం నిల్వల తరలింపునకు సంబంధించిన ప్రణాళికలపై రాబోయే 30 నుండి 60 రోజుల్లో చర్చలు జరగనున్నట్లు ఆ కథనం సూచించింది.
అయితే, న్యూయార్క్ టైమ్స్ చేసిన ఈ ప్రధాన వాదనను ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తోసిపుచ్చారు. తమ యూరేనియం నిల్వలను దేశం దాటించడానికి ఇరాన్ ఎలాంటి అంగీకారం తెలపలేదని, ప్రస్తుత ప్రాథమిక ఒప్పందంలో ఇరాన్ అణు అంశం భాగం కాదని సదరు అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు స్పష్టం చేశారు. అణు నిల్వల అంశాన్ని తుది ఒప్పందం కోసం జరిగే చర్చల్లో చూసుకుంటామని, ప్రస్తుతానికి యూరేనియం తరలింపుపై ఎలాంటి ఒప్పందమూ జరగలేదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) గణాంకాల ప్రకారం.. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఆయుధాల తయారీ స్థాయికి అత్యంత సమీపంలో ఉన్న సుమారు 400 కిలోల సుసంపన్న యూరేనియం నిల్వలు ఉన్నాయి.






