- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిక్‌టాక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లోకి తిరిగి ఎంట్రీ..?
టిక్‌టాక్ లవర్స్‌కు అధిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ లోకి రానున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: కరోనా సమయంలో భారత ప్రభుత్వం (Government of India) చైనా యాప్(China Apps)లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో కోట్లాది మంది టిక్ టాక్ యూజర్లు (TikTok users) నేరుగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లోకి వెళ్లారు. అయితే టిక్ టాక్ లో ఉన్న ఫిచర్లు ఇన్‌స్టాలో లేకపోవడంతో నేటికి సోషల్ మీడియా యూజర్లకు వెలితిగానే ఉంది. ఈ క్రమంలో టిక్‌టాక్ లవర్స్ (TikTok Lovers)కు అధిరిపోయే న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ లోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వం నేరుగా చైనాతో పలు ఒప్పందాలు చేసుకుంటున్న క్రమంలో టిక్ టాక్ తిరిగి రావొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
ఈ అంచనాలకు బలం చేకూరుస్తూ.. ఐదు సంవత్సరాలలో మొదటిసారిగా టిక్‌టాక్ వెబ్‌సైట్ (TikTok website) అనేక మంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో అతి తర్వలోరే ప్రముఖ వీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్ భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు అనేక పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నిజమైతే గత ఐదు సంవత్సరాలుగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న మెటా సంస్థ (Meta organization)కు కోలుకోలేని దెబ్బ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.






