Good News : దివ్యాంగులకు కేంద్రం గుడ్ న్యూస్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-22 13:28:13  IST  )

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

Good News : దివ్యాంగులకు కేంద్రం గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గృహ కేటాయింపులలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం 2016 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ (RPwD) చట్టం, సుగమ్య భారత్ అభియాన్‌కు దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్టు పేర్కొంది. దివ్యాంగులకు సమాన అవకాశాలు, గౌరవం, ప్రజా సేవల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్" ఆశయాలకు అనుగుణంగా, దివ్యాంగుల సాధికారతకు తమ శాఖ పెద్దపీట వేస్తోందని పేర్కొంది. ఈ నిర్ణయంపై దివ్యాంగులు, వారి హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story