రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. వెయిటింగ్ లిస్ట్ (WL) ప్రయాణికులకు ఊరట కల్పిస్తూ, రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాన్ని 4 గంటల నుండి 8 గంటలకు మార్చింది. ఈ నిర్ణయానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు. కొత్త నిబంధన ప్రకారం, రైలు బయలుదేరే 8 గంటల ముందు తొలి చార్ట్ సిద్ధం అవుతుంది. రాత్రి 12 గంటల నుండి ఉదయం 11 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ముందురోజు రాత్రి 9 గంటలకు చార్ట్ తయారవుతుంది. ఇక చివరి చార్ట్ రైలు బయలుదేరే 30 నిమిషాల ముందు ఫిల్టర్ చేయబడుతుంది. ఇందులో రద్దైన టికెట్లు, ఖాళీ సీట్ల వివరాలు ఉంటాయి.

ఈ మార్పు వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ముందుగానే టికెట్ కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకుని ప్రయాణ ప్రణాళికను మరింత సులభం చేస్తుంది. మరీ ముఖ్యంగా 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవారికి ఉపయోగకరంగా ఉండనుంది. అలాగే ఇది తత్కాల్ టికెట్లపై ఈ విధానం ప్రభావం చూపదు అంటున్నారు అధికారులు. ప్రస్తుతం బికనీర్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలవుతున్న ఈ విధానంపై సానుకూల స్పందన వస్తే దేశవ్యాప్తంగా అమలు కానుంది.

Next Story