- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేద, మధ్య తరగతి కుటుంబాలకు తీపి కబురు.. GSTలో ఇక రెండు శ్లాబు రేట్లే..!
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా సామాన్యులకు ఊరట కలిగిస్తూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే

దిశ, వెబ్‌డెస్క్: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా సామాన్యులకు ఊరట కలిగిస్తూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రాబోయే దీపావళి పర్వదినం నుంచి సామాన్య ప్రజలపై జీఎస్టీ (GST) భారం తగ్గించేందుకు కొత్త సంస్కరణలను చేపట్టబోతున్నట్లుగా వెల్లడించారు. తాజాగ ప్రకటనతో పేద, మధ్య తరగతి కుటుంబాలతో పాటు చిన్న మరియు మధ్య తరగతి వ్యాపారాలకు (MSME)లు భారీగా ప్రయోజనం చేకూరింది. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొత్త స్లాబ్ రేట్లతో భారత్‌ను ఆర్థిక శక్తిగా నిలపడమే కాకుండా.. స్వయం సమృద్ధి సాధించమే లక్ష్యంగా కేంద్రం మూడు అంశాలతో ప్రతిపాదనలను ముందుకు వెళ్తోంది. అందులో నిర్మాణాత్మక సంస్కరణలతో పాటు రేట్ల హేతుబద్ధీకరణ, సాధారణ, మధ్య తరగతి ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం లాంటి అంశాలు ఉన్నాయి.
అయితే, ప్రస్తుతం జీఎస్టీ 5, 12, 18, 28 శాతం శ్లాబ్‌ల స్థానంలో ఇక నుంచి రెండు స్లాబ్‌లను మాత్రమే అమల్లోకి తీసుకు రానున్నారు. అందులో ఒకటి స్టాండర్డ్ శ్లాబ్, రెండోది మెరిట్ శ్లాబ్. మరోవైపు ఎంపిక చేసిన వస్తువులపైనే ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆలోచన చేస్తోంది. ఈ సంస్కరణలు సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి, రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చకూర్చనున్నాయి. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు జీఎస్టీ కౌన్సిల్ (GST Council)పై ఏర్పాటు చేసిన సెంట్రల్ కేబినెట్ సబ్ కమిటీ రివ్యూ కోసం వెళ్లాయి. వర్గీకరణ వివాదాలు తగ్గించడం, రేట్ల స్థిరత్వాన్ని నిర్ధారించడం, వ్యాపార అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ఆ కమిటీ దృష్టి సారించనుంది. ఈ మొత్త పరిణామాలతో దేశంలో కీలక ఆర్థిక రంగాలను బలోపేతం చేయడం, ఆర్థిక కార్యకలాపాలను పెంచడం, ఆయా రంగాల వృద్ధిని ప్రోత్సహించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుండటంతో అందులో ఈ సంస్కరణలకు ఆమోదం పొందనున్నాయి.






