- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస ఉద్రిక్తతల వేళ ఢిల్లీ ప్రజలకు చల్లటి కబురు
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఒకవైపు పొల్యుషన్, మరోవైపు ఉద్రికత్తలు, ఇంకోవైపు మాడు పగిలే ఎండలతో ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు భారత వాతావరణ శాఖ(Indian Meteorological Department) చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) ప్రవేశిస్తాయని తెలిపింది. ఈనెల 27వ తేదీన దేశంలోకి నైరుతీ ప్రవేశించి.. జూన్ 1వ తేదీన కేరళ(Kerala)ను తాకనున్నాయని పేర్కొంది. గతేడాది మే 30న రాగా.. 2023లో జూన్ 8న, 2022లో మే 29న దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం(Rain) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీకి 18.2 శాతం తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.






