వాహనదారులకు గుడ్ న్యూస్: పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత!

by Naga Rani Yarlagadda |

దేశంలోని వాహనదారులందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది.

వాహనదారులకు గుడ్ న్యూస్: పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని వాహనదారులందరికీ కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. పెట్రోల్, డీజిల్ సరఫరా, పంపిణీలపై గతంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జులై 1వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేస్తూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఇంధన పంపిణీ మరింత సులభతరం కానుంది.

ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిమాండ్‌కు సరిపడా ఇంధనం అందుబాటులో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2026 జూన్ 12న దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రకటన రాగా.. జులై 1 నుండి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. ఈ ప్రభుత్వ నిర్ణయం మేరకు దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ల రిటైల్ అవుట్‌లెట్లపై (పెట్రోల్ బంకులు) ఉన్న అన్ని రకాల నియంత్రణలను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనివల్ల బంకులకు ఇంధన సరఫరా నిరంతరాయంగా సాగడమే కాకుండా, వినియోగదారులకు ఎటువంటి కొరత లేకుండా పెట్రోల్, డీజిల్ లభించనున్నాయి.

Next Story