మొబైల్ వినియోగదారుకు తీపి కబురు.. మార్చికల్లా అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి

by Prasad Jukanti |

కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది.

మొబైల్ వినియోగదారుకు తీపి కబురు.. మార్చికల్లా అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాలర్ పారదర్శకత మెరుగుపరచడంతో పాటు స్పామ్ తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గుడ్ న్యూస్ చెప్పింది. మన కాంటాక్ట్ లిస్ట్ లో లేని కొత్త నంబర్ నుంచి వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ కు వ్యక్తి పేరు కనిపించే విధానం మార్చికల్లా అందుబాటులోకి రానున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపారు. ఈ మేరకు ఈ విధానం ప్రస్తుతం ఒక్కో సర్కిల్‍లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. పెరిగిపోతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల నేపథ్యంలో వీటిని అరికట్టేందుకు కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ (CNAP) విధానాన్ని టెలికాం విభాగం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ట్రాయ్ అంగీకరించిది. ఈ విధానం అమల్లోకి వస్తే అవతలి వైపు నుంచి వచ్చే గుర్తుతెలియని కాల్స్ విషయంలో మొబైల్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండే అవకాశం కలగనుంది.

Next Story