- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
మధ్యప్రదేశ్ లోని రైతుల కోసం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ లోని రైతుల కోసం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. భోపాల్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తుందన్నారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని అన్నదాతలకు ఈ పథకాన్ని సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సరైన మౌలికవసతులు, సాగునీరు, విద్యుత్, రోడ్లు లేవన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు. రైతులకు మంచి చేయాలని.. వారి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, నీటిపారుదల కోసం సోలార్ పైపుల ద్వారా రైతులకు విద్యుత్ సంబంధిత ఇబ్బందుల్ని తమ ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. రాబోయే మూడేళ్లలో 30లక్షల సోలార్ ఇరిగేషన్ పంపుల్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అన్నదాతల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్ ని కొనుగోలు చేసేందుకు కూడా రెడీగా ఉందన్నారు.






