వినియోగదారులకు తీపికబురు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-31 17:48:18  IST  )

వినియోగదారులకు బిగ్ అలర్ట్. దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గాయి.

వినియోగదారులకు తీపికబురు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: వినియోగదారులకు బిగ్ అలర్ట్. దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ.24కు తగ్గించాయి. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగానే ఇవాళ (జూన్ 1)కి సంబంధించి ధరలను సవరించాయి. అయితే, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. తగ్గిన ధరలతో ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,945కు, ఢిల్లీలో 1,723కు, ముంబైలో రూ.1,675కు చేరింది. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Next Story