- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్పస్వాములకు గుడ్ న్యూస్
విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌరవిమానయానశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు తమవెంట ఇరుముడిని తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇది వరకు ఉన్న ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాలి అనే నిబంధనలను ఉపసంహరించుకుంది.

దిశ, వెబ్ డెస్క్: విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు పౌరవిమానయానశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అయ్యప్ప స్వాములు తమవెంట ఇరుముడిని తీసుకుని వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇది వరకు ఉన్న ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాలి అనే నిబంధనలను ఉపసంహరించుకుంది. ఈరోజు నుండే ఇది అమలులోకి వస్తుందని జనవరి 20వ తేదీ వరకు వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే శబరిమల యాత్రకు వెళుతున్న భక్తులు విమాన ప్రయాణంలో తమ వెంట ఇరుముడి తీసుకెళ్లే అవకాశం కల్పిచాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇరుముడులను చెక్ ఇన్ బ్యాగేజీగా కాకుండా ప్రయాణికులతోనే తీసుకెళ్లేలా అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. స్వాములు రిక్వెస్ట్ చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడులను ట్యాగ్ చేశారు. దీంతో స్వాములు కోరినట్టుగా పౌరవిమానయానశాఖ శుభవార్త వినిపించింది.






