ఎలాన్ మస్క్‌‌తో వివాదం.. స్టార్‌లింక్ సేవలపై ట్రంప్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-10 10:33:59  IST  )

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk)కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఎలాన్ మస్క్‌‌తో వివాదం.. స్టార్‌లింక్ సేవలపై ట్రంప్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌ (Elon Musk)కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత వారం రోజులుగా వారి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (డోజ్‌) చీఫ్‌ పదవి నుంచి ఎలాన్ మస్క్ వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ వైట్‌హౌస్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ప్రెసిడెంట్ ట్రంప్, మస్క్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో పరిధిలో మస్క్‌కు చెందిన స్టార్ లింక్ సేవలను నిలిపివేస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. తమకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.

వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ బిల్లుపై జరిగిన వివాదం తర్వాత టెస్లా సీఈవో తనతో సంప్రదించాల్సి ఉండాల్సిందని కామెంట్ చేశారు. ప్రస్తుతం మస్క్‌తో మాట్లాడే ఆలోచనను ఇంకా పరిశీలించలేదని అన్నారు. ఒకవేళ అతడి స్థానంలో తాను ఉంటే తప్పకుండే కాల్ చేసేవాడినని తెలిపారు. మస్క్ ఇచ్చిన టెస్లా కారు.. వైట్‌హౌస్‌ ఎదుటే పార్క్ చేసిన ఉందని అందులో తాను చక్కర్లు కొడతానంటూ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చమత్కరించారు.

Next Story